Kolo Kolanna Kolo Song Lyrics


Movie: Tuck Jagadish
Music : Thaman
Vocals :  Armaana Malik, Harini Ivvaturi, Sri Krishna, Thaman S
Lyrics : Seetharama Sastry
Year: 2021
Director: Shiva Nirvana
 

Telugu Lyrics

కోలో కోలన్న కోలో
కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు
కళ్ళల్లో కొలువుండాలి
ఆరారు ఋతువుల్లోని అక్కర్లేనిది ఏవుంది
చూడాలే గాని మన్నే రంగుల పూదోటవుతుంది
తోడై నీ వెంట కడ దాకా నేనుంటా
రాళ్ళైనా ముల్లైనా మన అడుగులు పడితే
పూలై పొంగాలా
నువు దీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ దైర్యంగా ఎదురెళ్లి నిల్చుంటే
నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా
కోలో కోలన్న కోలో
కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు
కళ్ళల్లో కొలువుండాలి

చిన్న చిన్నా ఆనందాలు
చిన్నబోని అనుబంధాలు
అప్పుడప్పుడు చెక్కిలిగింతలు పెడుతుండగా
కలత కన్నీళ్లు లేని చిన్ననాటి కేరింతల్ని
చిటికేసి ఇటు రమ్మంటు పిలిపించగా
కదిలొస్తోంది చూడు కన్నుల విందుగా
ఊరందరిని కలిపే ఉమ్మడి పండుగా
ఆ నలుగురితో చెలిమి పంచుకో
చిరునగవు సిరులు పెంచుకో
జడివానే పడుతున్న జడిసేన తడిసేన
నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైనా
నువు దీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ దైర్యంగా ఎదురెళ్లి నిల్చుంటే
నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా

నీలోను నాలోనూ ఈ నేలెగా అమ్మాయి ఉంది
అంతా అయినోళ్లే గాని పరులెవ్వరు
మనలోని చుట్టరికాన్నీ మరిపించే ఈ దూరాన్ని
చెరిపే వీలుందంటే కాదనరెవ్వరు
ఒక పువ్వు విచ్చిన గంధం ఊరికే పోదుగా
పది మందికి ఆనందం పంచకపోదుగా
ఆ… తగిన వరసైన తారక తెరలు విడి దరికి చేరగా
ప్రతినిత్యం పున్నమిగా అనుకోదా నెలవంక
కలలన్ని విరియగా విరిసిన వెన్నెలగా
నువు దీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ దైర్యంగా ఎదురెళ్లి నిల్చుంటే
నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా
కోలో కోలన్న కోలో
కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు
కళ్ళల్లో కొలువుండాలి

Leave a Comment