Ranguladdhukunna lyrics


Movie: Uppena
Music : Sreemani
Vocals :  Yazin Nizar &, Haripriya
Lyrics : Devi Sri Prasad
Year: 2021
Director: Buchi Babu Sana
 

Telugu Lyrics

రంగులద్దుకున్న తెల్ల రంగులవుదాం

పూలు కప్పుకున్న కొమ్మలల్లే ఉందాం

ఆకు చాటు ఉన్న పచ్చి పిందెలవుదాం

మట్టి లోపలున్న జంట వేరులవుదాం…

ఎవ్వరి కంటిచూపు చేరలేని ఎక్కడ మన జంట ఊసురాని

చోటున పద నువ్వు నేనుందాం

రంగులద్దుకున్న తెల్ల రంగులవుదాం

పూలు కప్పుకున్న కొమ్మలల్లే ఉందాం

తేనే పట్టులోన తీపి గుట్టు ఉందిలే

మన జట్టులోన ప్రేమ గుట్టుగుందిలే

వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందాం

లోకాల చూపుల్ని ఎట్ట తప్పించుకెళ్ళలో

కొత్త పాఠాలు నేర్చుకుందాం

అందరు ఉన్న చోట ఇద్దరవుదాం

ఎవ్వరు లేని చోట ఒక్కరవుదాం

ఏ క్షణం విడివిడిగా లేమందాం

రంగులద్దుకున్న తెల్ల రంగులవుదాం

పూలు కప్పుకున్న కొమ్మలల్లే ఉందాం

మన ఊసు మోసే గాలిని ముట కడదాం

మన జాడ తెలిపే నేలను పాతిపెడదాం

చూస్తున్న సూర్యుని తెచ్చి లాంతరులో దీపాన్ని చేసి చూరుకెలాడదిద్దాం

సాక్ష్యంగా సంద్రాలు ఉంటె దిగుడు బావిలో దాచి మూత పెడదాం

నేనిలా నీతో ఉండడం కోసం చేయనీ ఈ చిన్నపాటి మోసం

నేరెమేం కాదె ఇది మన కోసం

రాయిలోన శిల్పం దాగి ఉండునంట

శిల్పి ఎదురైతే బయట పడునంటా

అద్దామెక్కడున్న ఆ వైపు వెళ్లకంటా

నీలో ఉన్న నేనే బయట పడిపోతా

పాలలో ఉన్న నీటిబొట్టు లాగా

నెలల్లో దాగి ఉన్న మెట్టు లాగా

నేనిలా నీ లోపల దాక్కుంటా

హైలెస్సా హైలెస్సా హయ్…

Leave a Comment