Evo Evo Kalale Song Lyrics


Movie: Love Story
Music :Bhaskarabhatla Ravi Kumar
Vocals :  Nakul Abhyankar, Jonita Gandhi
Lyrics : Pawan Ch
Year: 2021
Director: Sekhar Kammula
 

Telugu Lyrics

ఏవో ఏవో కలలే ఎన్నో ఎన్నో తెరలే

అన్ని దాటి మనసే హే ఎగిరిందే

నన్నే నేనే గెలిచే క్షణాలివే కనుకే

పాదాలకే అదుపే లెదందే

రంపం తరరాంపం తరరాంపం ఎదలో

రంపం తరరాంపం తరరాంపం కథలో

ఏంటో కొత్త కొత్త రెక్కలొచ్చినట్టు

ఏంటో గగనంలో తిరిగా

ఏంటో కొత్త కొత్త ఊపిరందినట్టు

ఏంటో తమకంలో మునిగా

ఇన్నాళ్లకి వచ్చింది విడుదల

గుండె సడి పాడింది కిల కిల

పూల తడి మెరిసింది మిల మిల

కంటి తడి నవ్వింది గల గల

ఉహించలేదసలే ఊగిందిలే మనసే

పరాకులో ఇపుడే హే పడుతోందే

అరె అరె అరెరే ఇలా ఎలా జరిగే

సంతోషమే చినుకే దూకిందే

రంపం తరరాంపం తరరాంపం ఎదలో

రంపం తరరాంపం తరరాంపం కథలో

ఏంటో కళ్ళలోన ప్రేమ ఉత్తరాలు

ఏంటో అసలెప్పుడు కనలే

ఏంటో గుండె చాటు ఇన్ని సిత్తరాలు

ఏంటో ఎదురెప్పుడు అవలే

నీతో ఇలా ఒక్కొక్క క్షణముని

దాచెయ్యన ఒక్కొక్క వరమని

నీతో ఇలా ఒక్కొక్క ఋతువుని

పోగెయ్యనా ఒక్కొక్క గురుతుని

ఇటు వైపో అటు వైపో

ఇటు వైపు మనకే తెలియని వైపు

కాసేపు విహరిద్దాం చలరే

ఏంటో మౌనమంత ముఠా విప్పినట్టు

ఏంటో సరిగమలే పాడే

ఏంటో వాన విల్లు గజ్జె కట్టినట్టు

ఏంటో కథకళినే ఆడే

గాల్లోకిలా విసరాలి గొడుగులు

మన స్వేచ్చకీ వేయొద్దు తొడుగులు

సరిహద్దులు దాటాలి అడుగులు

మన జోరుకి అదరాలి పిడుగులు

ఏంటో అల్లిబిల్లి హాయి మంతనాలు

ఏంటో మన మధ్యన జరిగే

ఏంటో చిన్న చిన్న చిలిపి తందనాలు

ఏంటో వెయ్యింతలు పెరిగే

ఏంటో ఆశలన్నీ పూసగుచ్చడాలు

ఏంటో ముందెప్పుడూ లేదే

ఏంటో ధ్యాస కూడా దారి తప్పడాలు

ఏంటో గమ్మత్తుగా ఉందే

Leave a Comment