Vechani Mattilo Song Lyrics


Movie: Middle Class Melodies
Music :Sweekar Agasthi
Vocals :  Sweekar Agasthi
Lyrics : Sai Kiran
Year: 2020
Director: Vinod Anantoju
 

Telugu Lyrics

వెచ్చని మట్టిలో నాటిన విత్తనం

ఊపిరందుకోదా చుక్క నీరు పట్టిన

రాతిరే కప్పిన దారులే తప్పిన

తెల్లవారనంద చీకటేంత కమ్మిన

తురుపింట మొదలైన కిరణాల వేడి

లోకమంతా అందాలు అందించదా

దారిలోన ఎదురైనా గ్రహణాలు వీడి

రంగులద్దుకుంటూ రాదా

చిగురాకు పిలిచింది రారమ్మని

నీలాకాశానా మేఘలని

అటు నుండి బదులేది రాలేదని

అలిగిందా ఆ ఆమని

జరిగింది గమనించి ఆ చల్లగాలి

జోలాలి పాడింది తన చెంత చేరి

చిన్నబోయిన ఆ చిన్న ప్రాణానికి

వేకువింట మొదలైన కిరణాల వేడి

లోకమంతా అందాలు అందించదా

దారిలోన ఎదురైనా గ్రహణాలు వీడి

రంగులద్దుకుంటూ రాదా

Leave a Comment