Telugu Lyrics
ఆ పక్క నాదే
ఈ పక్క నాదే
తలపైన ఆకాశం ముక్క నాదే
ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే
తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే
నన్నైతే కొట్టేడోడు భూమ్మీదే పుట్టలేదు
పుట్టాడా అది మళ్ళా నేనే
నను మించి ఎదిగేటోడు
ఇంకోడు ఉన్నాడు సూడు
ఎవడంటే అది రేపటి నేనే
నే తిప్పానా మీసమట
సేతిలోనా గొడ్డలట
సేసిందే యుద్ధమట సేయ్యందే సంధి అట…
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
అరె ఏయ్ బిడ్డ ఇది నా అడ్డానిను ఏట్లో ఇసిరేస్తా
నే సేపతో తిరిగొస్తా
గడ కర్రకు గుచ్చేస్తా
నే జండాలా ఎగిరేస్తా
నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా
నే ఖరీదైన ఖనిజంలా మళ్ళి దొరికేస్తా
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
అరె ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఎవడ్రా ఎవడ్రా నువ్వు
ఇనుమును ఇనుమును నేను
నను కాల్చితే కత్తవుతాను
ఎవడ్రా ఎవడ్రా నువ్వు
మట్టిని మట్టిని నేను
నను తొక్కితే ఇటుకవుతాను
ఎవడ్రా ఎవడ్రా నువ్వు
రాయిని రాయిని నేను
గాయం కానీ చేసారంటే
ఖాయంగా దేవుడ్నివుతాను
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
నేనే తగ్గేదేలే
అరె ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
నేనే తగ్గేదేలే
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }