Movie:Jayamma Panchayathi
Music : Keeravaani
Vocals : Keeravaani, Hariharan
Lyrics :Chaitanya Prasad
Year: 2022
Director: Vijay Kumar Kalivarapu
Telugu Lyrics
కలిసి బతికె కాలమే మాయే నేడే
పగటి వేళా పీడా కలలాయే
అలసిపోని ఆశలే మాయే అయ్యో
గొలుసు కట్టు గోసలైపోయే
పొరపాట్లు కొన్ని
పంతాలతోని మరి ఎంతకీ
తేలదు పంచాయతీ
కలిసి బతికె కాలమే మాయే నేడే
పగటి వేళా పీడా కలలాయే
పుటకతో పూజకు తగవని
కోవెల కొలువుకే గోలాయే
వలపులే దూరపు తలపులై
ప్రేమకి తలుపులే ముసాయే
వెంటాడే మా భయాలే దెయ్యాలై
మంచి పైనే మన్నేసేలే
కర్మే కాలి పెద్దోళ్లే చెడ్డోలై బందీలైనారా
నారేనా…. ఆ… ఓ..
నారేనా…. ఆ… ఓ..
కలిసి బతికె కాలమే మాయే నేడే
పగటి వేళా పీడా కలలాయే
వెలుగునే చూడని కలుగులో
చీకటి బతుకులై పోయెనే
తిరుగుతూ ఆశను వెతుకుతూ
కలిసి బతికె కాలమే మాయే నేడే
పగటి వేళా పీడా కలలాయే
అలసిపోని ఆశలే మాయే అయ్యో
గొలుసు కట్టు గోసలైపోయే
పొరపాట్లు కొన్ని
పంతాలతోని మరి ఎంతకీ
తేలదు పంచాయతీ