Telugu Lyrics
చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి
లాలి జో లాలీ… లాలీ జో లాలీ
ఊహల్లో తేలంగా ఊయలేయాలి
నా పాటు వింటూ నిదురపోవాలి
పిల్లగాలి లాలించి పోవే
కొండెక్కి ఆ వెండి వెన్నెల్లు తేవే
జాజి పువ్వా జాబిలిని తేవే
చిరుముద్దు మరుముద్దు ఇచ్చి పొమ్మనవే
చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి
లాలి జో లాలీ… లాలీ జో లాలీ
చిన్ని నా బాబంటే వేయియేళ్ల వెలుగు
ఈ అమ్మ ఆశీస్సు నిను కాచగలుగు
ఉదయించే సూరీడే వెలుగిచ్చే రూపం
హృదయంలో ప్రేమే వెదజల్లే దీపం
మరుమల్లె కూన మాణిక్య వీణ
నా కంటి పాప కనురెప్పయి కలకాలం కాచెను కన్నా
గుండెల్లో పదిలంగా దాచెను నాన్న
చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి
లాలి జో లాలీ… లాలీ జో లాలీ
తారళ్లే కనువిందై తారాడే కన్నా
పలికే జాబిల్లై పారాడే చిన్నా
నా నోము ఫలమంటే నువ్వేరా నాన్న
లోకాన సిరియే లేదు నీ కన్నా
నా ప్రాణమల్లె పెంచెను నిన్నే బంగారు కొండై
కలకాలం కుంజాలి బతకాలి ఇలలో
కలకాలం కుంజాలి బతకాలి ఇలలో
కలకాలం కుంజాలి బతకాలి ఇలలో
కలకాలం కుంజాలి బతకాలి ఇలలో
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i