Telugu Lyrics
దింతానా దింతాన ఇది మనసు పండగని అనుకొనా
దింతాన దింతాన కల ఎదుట వాలినది నిజమేనా
దింతానా దింతాన ఇది మనసు పండగని అనుకొనా
దింతాన దింతాన కల ఎదుట వాలినది నిజమేనా
కనురెప్పల కోలాటామిది ఏడ చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది నులివెచ్చగా బాగుందిది
హే.. నిన్నింక వదలనులే
నీ చెయ్యి విడవనులే నీలోంచి కదలనులే
దింతానా దింతాన ఇది మనసు పండగని అనుకొనా
దింతాన దింతాన కల ఎదుట వాలినది నిజమేనా
పాలసంద్రంలా పొంగిపోతున్న
పాలపుంతల్లో తేలిపోతున్న
విరిసే తోటలన్నీ తూనీగలా తిరిగేస్తున్న
కురిసే తారాలన్నీ దోసిళ్లల్లో నింపేస్తున్న
చెట్టు కొమ్మల్లే ఊగిపోతున్న
కొత్త జన్మేదో అందుకుంటున్న
రెక్క విప్పుకుంటూ గువ్వలన్నీ గుండెలోకి
దూకినట్టు ఉత్సవాలు జరుపుతున్న
నింగి అంచు మీద రంగు రంగు చేపలుగా గెంతుతున్న ఓ…
దింతానా దింతాన ఇది మనసు పండగని అనుకొనా
దింతాన దింతాన కల ఎదుట వాలినది నిజమేనా
ఇంతకాలంగా ఎక్కడున్నావే
ఉన్నపలంగా ఊడిపడ్డావె
తెలిసి తెలియనట్టు నా మనసునే లాగెసావే
అసలేం ఎరగనట్టు నీ వెనకనే తిప్పించావే
నిన్ను చూసాకే ప్రాణమొచ్చిందే
వింత లోకంలో కాలు పెట్టిందే
నిన్ను తాకుతున్న గాలి వచ్చి నా చెంప గిల్లుతుంటే
అంతకన్నా హాయి ఉండదే
అరె నిన్ను తప్ప కాని ఇంక నన్ను కూడా చూడనందే ఓ..
దింతానా దింతాన ఇది మనసు పండగని అనుకొనా
దింతాన దింతాన కల ఎదుట వాలినది నిజమేనా
కనురెప్పల కోలాటామిది ఏద చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది నులివెచ్చగా బాగుందిది
హే.. నిన్నింక వదలనులే
నీ చెయ్యి విడవనులే నీలోంచి కదలనులే
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }