Telugu Lyrics
అల్లమెల్లిగడ్డ ఓ అవ్వ సాటు బిడ్డ
నీ ఎనుక నేను పడ్డా
అరె ప్లాన్ బోర్లా పడ్డా
నేనేం బాగు పడ్డా
నోట్లో వేలు పెట్టితే కొరకనోన్ని
నా నోట్లో మన్ను కొట్టకే కృష్ణవేణి
నువ్వంటే మనసు పది చచ్చేటోన్ని
నన్ను సంపి బొంద పెట్టాకే కృష్ణవేణి
కృష్ణవేణి ఓ కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
అరే ప్యాసింజరు బండిలోన
ప్యారు నిన్ను చేసిన్నే
మెసెంజర్ వాట్సాప్ లో
ముచ్చట్లెన్నో చెప్పీనే
నవంబరు మంచు లెక్క
నవ్వుతుంటే మురిసిన్నే
డిసెంబర్ పువ్వు లెక్క
దిల్ లోన దాచిన్నే
కాలెండరే సీంపేసి సిలిండర్ అయ్యి పేలితివే
ఓయ్.. కృష్ణవేణి ఓ కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
కృష్ణవేణి ఓ కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
మా ఊర్ల అందరిట్లా నేనే పెద్ద తోపుని
బకరానైతిని మీ అమ్మ గిస్తే మ్యాప్ నీ
నడిమిట్ల మా అయ్యకు రుద్దినారు సోపుని
నాకేమి సమజ్ కాకా గుద్దినను ఆఫ్ ని
నిన్న మొన్న నువ్వు కలిసి కలలు కన్నమే
ఇయ్యాళ నువ్వు నాకు పీడా కలై పోయావే
ఒక్క నిముషం అయినా నిన్ను ఇడిసి ఉండలేనోన్ని
పక్కల ఓ పాములేక్క బుసలు కొట్టుతున్నవే
కృష్ణవేణి ఓ కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
మ్యాటర్ చిన్నది మీటర్ ఏమో పెద్దది
బుజ్జిగాని బతుకు చూడు
బజార్లనే పడ్డది
నచ్చిన చిన్నది నరాల తీస్తా ఉన్నదీ
ఇజాత్ అంత చినిగి చినిగి సాఠెయతున్నది
మూడు ముళ్ళు ఏసుకొని అయితదంటే వైఫు
నాల్గురోళ్ల మధ్య నిలిచి నూరుతుంది నైఫు
దానింట్ల పీనుగేళ్ల ఉందొ లేదో రేపు
నా డెడ్ బాడీని నాతో మోయిస్తుందిరా లైఫు
కృష్ణవేణి ఓ కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
నాకు నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }