Telugu Lyrics
చీకటిలో ఉన్నా దారే లేకున్నా
నీకే నువ్వు తోడై ఉంది లే త్వరగా
బలమే లేకున్నా బాధే అవుతున్నా
ఆశే నీలో నింపుకోరా ఊపిరిగా
కన్నుల్లో నీటి చుక్కే ఉన్నాగాని
నవ్వేసి చూడు రెయిన్బో రంగులు అని
నెలవంక లాగ చిక్కిపోయిన గాని
వెన్నెల పంచు పున్నమిలా
మంచి రోజులొచ్చాయి
ఓ మంచి రోజులొచ్చాయి
మంచి రోజులొచ్చాయి
అందరికి మంచి రోజులొచ్చాయి
ఆ నింగి నేలకే దూరం ఎంత
దూకేస్తే దైర్యంగా ఓ చినుకంతా
నమ్మకమే నీకుంటే విత్తనమంతా
చిగురించవా చెట్టంతా
మండే ఎండకె వెనుకడుగెందుకు
పెరిగే నీడలా పదా ముందుకు
ఈ రోజే మళ్ళి పుట్టి వేకువలా
మంచి రోజులొచ్చాయి
ఓ మంచి రోజులొచ్చాయి
మంచి రోజులొచ్చాయి
అందరికి మంచి రోజులొచ్చాయి
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }