Mother Song Lyrics From Valimai


Movie: Vaalimai Telugu
Music : Yuvan Shankar Raja
Vocals :  Pradeep Kumar
Lyrics : Srinivasa Moorthy
Year: 2022
Director: 
 

Telugu Lyrics

నే కన్న తోలి ముఖము

నే విన్న తోలి స్వరము

స్ప్రుశించిన తోలి స్పర్శ నీదే

నీ ఉదరం తోలి గదిలే

నీ హృదయం తోలి గతి లే

నే మెచ్చిన తోలి వనిత నీవే

చింతలు లేని విరినవ్వై

రెక్కలు తొడిగిన చిరుగువ్వై

నింగిన మెరిసే ధ్రువ తారై

నన్ను సాకగా

ఎంతటి ఎత్తు ఎదిగినను

తల్లికి తనుయులు పిల్లలేగా

కంటిని రెప్ప కాచునటు కాచినావుగా

అమ్మ నా ఉనికివి నీవమ్మా

నా ఊపిరి నీవమ్మా

నా లోకమే నీవమ్మా

నాకై పుడమిన పుట్టావే పూజలు చేసావే

ఇలలో నోములు నోచావే

నీ దీవెనె నాకిచ్చు వరము కదా

నీ ప్రేరణే నాకిచ్చు జయము కదా

నీ సుఖములనే నా బ్రతుకునకై

పణంగా పెట్టావే

నే ఓడిన వేళా చెంతకొచ్చి

నా బలమును చాటి వెన్ను తట్టి

నను నడిపించే గెలిపించే

శక్తివి నీవేలే

అలుపంటూ ఏనాడూ సోలిందే లేదులే

ఈ జన్మ సరిపోవునా నీ ఋణం తీర్చగా

అమ్మా ఓ అమ్మా అమ్మా….

అమ్మ నా ఉనికివి నీవమ్మా

నా ఊపిరి నీవమ్మా

నా లోకమే నీవమ్మా

నాకై పుడమిన పుట్టావే పూజలు చేసావే

ఇల నోములు నోచావే

Leave a Comment

”
GO