Telugu Lyrics
నెల రాజుని ఇల రాణిని
కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా
తీరమై చేరుమా నడిరాతిరిలో
తెరలు తెరిచినది నిద్దురలో
మగత మరిచి ఉదయించినదా
కులుకు లొలుకు చెలి మొదటి కల
తన నవ్వులలో
తళుకు తళుకు తన చెంపలలో
చెమకు చెమకు తన మువ్వలలో
జనకు జనకు సరి కొత్త కల
ఓ ఛాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారదా రాతిరి
మిల మిల చెలి కన్నుల
తన కలలను కనుగొని
అచ్చెరువున మురిసి
అయ్యహా ఎంతటిధీ సుందరి
ఎవ్వరు రారు కదా తనసరి
సృష్టికే అద్దం చూపగా పుట్టినదేమో
నారి సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
తెర దాటి చెర దాటి
వెలుగు చూస్తున్న భామని
సరిసాటి ఎద మీటి
పలకరిస్తున్న జాముని
ప్రియమార గమనిస్తూ
పులకరిస్తుంది యామిని
కలబోసి ఊసులే విరబూసే ఆశలై
నవరాతిరి పూసిన వేకువ రేఖలు
రాసినది నవలా
మౌనాలే మమతలై
మధురాలా కవితలై
తుది చేరని కబురులా
కథకళి కదిలెను రేపటి కథలకు మున్నుడిలా
తన నవ్వులలో
తళుకు తళుకు
తన చెంపలలో
చెమకు చెమకు
తన మువ్వలలో
జనకు జనకు సరి కొత్త కల
ఇదిలా అని ఎవరైనా చూపనే లేదు కంటికి
అదెలాగో తనకైనా
తోచెనే లేదు మాటకి
ఇప్పుడిపుడే మనసైనా
రేపు దొరికింది చూపుకి
సంతోషం సరసన
సంకోచం మెరిసినా
ఆ రెంటికి మించిన
పరవశ లీలలు కాదని అనగలమా
కథ కదిలే వరసనా
తమ ఎదలేం తడిసిన
గత జన్మల పొడవునా
దాచిన దాహం
ఇపుడే వీరికి పరిచయమా
తన నవ్వులలో
తళుకు తళుకు
తన చెంపలలో
చెమకు చెమకు
తన మువ్వలలో
జనకు జనకు సరి కొత్త కల
తన నవ్వులలో
తళుకు తళుకు
తన చెంపలలో
చెమకు చెమకు
తన మువ్వలలో
జనకు జనకు సరి కొత్త కల
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i