Telugu Lyrics
భువిపై ఎవడు కనివిని
ఎరుగని అద్భుతమే జరిగేనే
భువిపై ఎవడు కనివిని
ఎరుగని అద్భుతమే జరిగేనే
దివిలో సైతం కథగా రాని
విధిలే వెలిగెనే
నీకు నువ్వే దేవుడన్నా
భావనంతా గతమున కథే
నిన్ను మించే రక్కసులుండే
నిన్ను ముంచే లోకం ఇదే
కాలము విసిరిందిలే
నీ పొగరు తలకు తగిన వలయము
ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యం ఇదే సాక్ష్యం ఇదే
బిక్షుడయ్యే బింబిసారుడే
ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యం ఇదే సాక్ష్యం ఇదేరాజభోగపు లాలస బ్రతుకే
మట్టి వాసన రుచి చుసినదే
ఆ… రాజభోగపు లాలస బ్రతుకే
మట్టి వాసన రుచి చుసినదే
రక్త దాహం మరిగిన మనసే
గుక్క నీళ్లకే పడి వేచినదే
ఏది దర్మం ఏది న్యాయం
తేల్చు వాడు ఒక్కడున్నాడులే
లెక్క తీసి శిక్ష రాసే
కర్మఫలమే ఒకటుందిలే
జన్మలో ఏ జన్మలో నీ పాపమో
ఆ జన్మలోనే పాప ఫలితమే
ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యం ఇదే సాక్ష్యం ఇదే
బిక్షుడయ్యే బింబిసారుడేనరకమిచ్చిన నరకుడి వధతో
దీప పండుగ మొదలయ్యినదే
నరకమిచ్చిన నరకుడి వధతో
దీప పండుగ మొదలయ్యినదే
నీతి మరచిన రావణ కథతో
కొత్త చరితే చిగురించినదే
రాక్షసుడివో రక్షకుడివో
అంతుతేలని ప్రశ్నవి నువ్వే
వెలుగు పంచె కిరణమల్లె
ఎదుగుతావో తెలియని కలే
ఏ క్షణం ఓ…
ఏ క్షణం ఏ వైపుగా
అడుగేయనుందో నీ ప్రయాణమే
ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యం ఇదే సాక్ష్యం ఇదే
బిక్షుడయ్యే బింబిసారుడే
ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యం ఇదే సాక్ష్యం ఇదే
బిక్షుడయ్యే బింబిసారుడే
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }