Thokachukka Song Lyrics


Movie: Modern Love Hyderabad
Music :M Keeravaani
Vocals :  M Keeravaani
Lyrics : Keeravaani
Year: 2022
Director: Nagesh Kukunoor
 

Telugu Lyrics

తోక చుక్కై నీలాకాశంలోన

పలకరించింది నువ్వేనా

చిన్ననాడే నే రాసుకున్న ఉత్తరమై

నన్ను వెతుకుంటూ వచ్చింది నువ్వేనా

వేదనై వెలికి పంపనా

వేకువై నే స్వాగతించనా

ఊహల్ని జోల పాడుతుంటే

కొత్త సాంత్వన

తోక చుక్కై నీలాకాశంలోన

పలకరించింది నువ్వేనా

చిన్ననాడే నే రాసుకున్న ఉత్తరమై

నన్ను వెతుకుంటూ వచ్చింది నువ్వేనా

విరిగిన బొమ్మలతో ఆడుకుంటావో

దొరకని తోడు కోసం వెతికి వేశారు తూంటావో

ఒక్క గూటి గువ్వలై ఉండమంటావో

నీడలాగా వెంటబడి

కూడా కూడా వెళ్లిపొమ్మనంటావో

ఎదలోతు లోతులలో

పరచిన ఆ గురుతులనే పదిలంగా

దాచుకుంటావో ఏంటో తెలిసినట్టు ఉన్నా

ఇంకా ఎంతో ఉంది లోనా

అర్థం కానీ రహస్యం నువ్వేనా

ప్రేమ అంటారు నిన్నేనా

తోకచుక్కై తోకచుక్కై
తోక చుక్కై నీలాకాశంలోన

పలకరించింది నువ్వేనా

చిన్ననాడే నే రాసుకున్న ఉత్తరమై

నన్ను వెతుకుంటూ వచ్చింది నువ్వేనా

నువ్వేనా ప్రేమ నువ్వేనా

నువ్వేనా ప్రేమ నువ్వేనా

ఓ… ఓ… ఓ…

Leave a Comment