Gaana Of Republic Lyrics


Movie: Republic
Music : Mani Sharma
Vocals :  Anurag Kulkarni, Dhanunjay, Hymanth mohammed
Lyrics : Rahman
Year: 2021
Director: Deva Katta
 

Telugu Lyrics

ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో

ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో

నా ప్రాణంలోని ప్రాణం

నా దేహంలోని దాహం

నా మౌనం పాడే గానం

నా ప్రశ్న సమాధానం

అది అందమైన అందరాని కన్నెరా

లక్ష అక్షరాలు రాయలేని కవిత రా

ఈ ప్రపంచమే కోరుకునే అతివరా

పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్చరా

నా కళ్ళలోన రంగుల కల రా…

నా కళ్ళలోన రంగుల కల రా…

నా ఊహలకే ఉనికే తనురా

నా బ్రతుకులోనా భాగం కదరా

నా ఊపిరికే అర్థం తనురా

ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో

ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో

తెల్లవాడినెదిరించి నల్లని చీకట్ల నుంచి

పిల్లను విడిపించి తెచ్చి సంబరాలు చేసుకుంటే

అంతలోనే తెలిసిందని మాయమైపోయిందని

ముందుకన్నా ముప్పువున్న పంజరానా ఉన్నదని

అసలెక్కడుందో తెలియకుంది చూడరా

అది లేక మనిషికింకా విలువేదిరా

ఏ పోరాటంతో దానిని చేరాలిరా ఆ..

ఏ ఆయుధంతో దానిని గెలవాలిరా

ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో

ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో

అనాదిగా ఎవడో ఒకడు అది నాకే సొంతమంటూ

నియంతలై నిరంతరం చెరలో బంధించారు ఉ…

రెక్కలని విరిచేసి హద్దులనే చెరిపేసి

అడిగే ప్రతి ఒక్కడిని అణిచి అణిచి వేసినారు

నరజాతి చరిత్రలో నలిగిపోయెరా

చల్లారని స్వాతంత్ర్య కాంక్ష స్వేచ్చారా

నరనరాల్లోనా ప్రవహించే ఆర్తీరా ఆ..

కనిపించక నడిపించే కాంతిరా

ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో

ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో (2)

Leave a Comment