Seba Transfer Song Lyrics


Movie: SebastianPC524
Music : Ghibran
Vocals :  Padmalatha
Lyrics : Sanapati Bharadwaj Patrudu
Year: 2022
Director: Balaji Sayyapureddy
 

Telugu Lyrics

కంటిలోని చీకటిని

గుండెలోన దాచుకొని

వేదనలో వేడుకలా వెలుగు సెబా

రాజాధిరాజా వదిలిపోని వేకువని

తిరుగులేని రేపటికి ఏలుకొనే ఏలికలా

ఎదుగు సెబా… రాజాధిరాజా

నిజాలు కన్న కలల్లో

సమాధి నీ గతం

సవాలు ఉన్న కథల్లో

జవాబు జీవితం

నిరాశ ఒడిలోన

పారాడక తీరానికి దారి చూపు ఆశ మీద

దూసుకుపో పారిపోక

రాజాధి రాజాధి రాజో రాజా

బాగుండు రరాజా

రాజాధి రాజాధి రాజో రాజా

భద్రం రేరాజా

రాజాధి రాజాధి రాజో రాజా

బాగుండు రరాజా

రాజాధి రాజాధి రాజో రాజా

భద్రం రేరాజా

నీ వంక చూసే

మసకబారు లోకం కనకుండా

చూడు నీ లోపం

నీ నీడకైనా తెలియనికు సారం

నిశ్శబ్దం చేయు నీకోసం

దోబూచులాడే కరుకు మనసు కాలం

కరిగేలా రగులు ఆసాంతం

ఏనాటికైనా నీకు నీవే ఊతం

నీతోనే నీకు పోరాటం

కంటిలోని చీకటిని

గుండెలోన దాచుకొని

వేదనలో వేడుకలా వెలుగు సెబా

రాజాధిరాజా వదిలిపోని వేకువని

తిరుగులేని రేపటికి ఏలుకొనే ఏలికలా

ఎదుగు సెబా… రాజాధిరాజా

రాజాధి రాజాధి రాజో రాజా

భద్రం రేరాజా

రాజాధి రాజాధి రాజో రాజా

బాగుండు రరాజా

రాజాధి రాజాధి రాజో రాజా

భద్రం రేరాజా

Leave a Comment